- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎస్పీ నూతన కమిటీ ఎకగ్రీవ ఎన్నిక
మండల పరిధిలోని తలుపునూరు గ్రామ బహుజన్ సమాజ్ పార్టీ కమిటీని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి మధు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దిశ, రేవల్లి : మండల పరిధిలోని తలుపునూరు గ్రామ బహుజన్ సమాజ్ పార్టీ కమిటీని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి మధు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులుగా తప్పేట గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా పెదగాల రాము, ప్రధాన కార్యదర్శిగా చందు, కార్యదర్శులు రాములు, వై.భాస్కర్, కోశాధికారి కే కిరణ్, సలహాదారులుచిన్న బుడ్డయ్య, శ్రీనివాసులు,శివకుమార్, ప్రచార కార్యదర్శి వేణు, భాస్కర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా మీద ఉంచిన నమ్మకం బాధ్యతను నిలబెట్టుకునేందుకు కట్టుబడి పని చేస్తామన్నారు. పార్టీ బలానికి మూలం ఐక్యత అన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేస్తే గ్రామంలో మండలంలో మార్పులు తీసుకురాగలుగుతామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే బీఎస్పీ నాయకత్వాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ నెంబర్ బండి పృథ్వీరాజ్, జిల్లా మాజీ ఇన్చార్జి మిద్దె మహేష్ తదితరులు పాల్గొన్నారు,






