నాగ‌ర్ క‌ర్నూల్ పోలీసుల‌కు సిగ్గుందా..బాధితుల‌పైనే ఉల్టా కేసులా..? : కేటీఆర్

by Ratna Kumari |   (  Updated:2026-02-25 09:10:15  IST  )

నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

నాగ‌ర్ క‌ర్నూల్ పోలీసుల‌కు సిగ్గుందా..బాధితుల‌పైనే ఉల్టా కేసులా..? :  కేటీఆర్
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పసిపాప మృతికి కారణమైన ఎనిమిది మంది నిందితులను హత్య నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ క‌ర్నూలు పోలీసులు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ కి వస్తే బాధితులపైనే ఉల్టా కేసి పెడతారా అంటే పోలీసులను నిలదీశారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పసిపాప మృతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.

కఠినంగా శిక్షించాలి..

పసిపాప ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిడ్డను కోల్పోయిన తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు ఇల్లు కట్టించి గృహప్రవేశానికి తానే హాజరవుతానని హామీ ఇచ్చారు. కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తారా..? అని ఎస్ఐ డిఎస్పీ,ఎస్పీలకు నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంబేద్కర్ సాక్షిగా పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story