బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

by Chintha Aamani |

మహిళా శక్తి సంఘాల సంబరాలు కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల యుద్ధం కొనసాగింది.

బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం
X

దిశ, ఉండవెల్లి : మహిళా శక్తి సంఘాల సంబరాలు కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల యుద్ధం కొనసాగింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల లో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శ చేశారు. అంతకుముందే ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళాడు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం మంత్రి మాట్లాడాల్సి ఉండగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కు ఎలా మైక్ ఇస్తారనన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేస్తున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ మాటలకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులకు లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.

అలాగే అలంపూర్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు ఇసుక మట్టి దందాలు జోరుగా సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి ఎదుటనే కాంగ్రెస్ నాయకులు విమర్శ ప్రతి విమర్శలకు దిగారు. గొడవ తీవ్రతరం అవుతుండడంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ మొగులయ్య తన సిబ్బందితో కలిసి ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పి గొడవను సర్దుమనిగించారు. ఒక్కసారిగా మహిళా శక్తి సంఘాల సంబరాలలో ఎమ్మెల్యే మాటలు హాట్ టాపిక్ గా మిగిలిపోయాయి.

Next Story