ఎమ్మెల్యే బీరంకు ఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

by Disha Web Desk 20 |
ఎమ్మెల్యే బీరంకు ఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, వీపనగండ్ల : కొల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గానికి రావడంతో, నాయకులు కార్యకర్తలు అభిమానులు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ఘనస్వాగతం పలుకుతూ కార్లు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పానగల్ నుంచి విపనగండ్ల మండల కేంద్రనికి చేరుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ భాజా భజంత్రీలతో, మహిళలు దీపాలతో హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం గ్రామాల్లోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి చేశారని, నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశారని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు ముంత మల్లయ్య యాదవ్, పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, కో- ఆప్షన్ సభ్యురాలు మౌలాన్ బి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కరుణాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సాయిరాం, రాజాక్, సాయిబాబు, వేణుమాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed