- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ బాట పట్టిన బీఆర్ఎస్.. ఏకాభిప్రాయంతో రండి అంటూ..!
దిశ, మక్తల్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టులో ఏకాభిప్రాయంతో వ్యక్తి ఎంపిక చేసుకుంటే రెబల్ పోటీ లేకుండా గెలుపు మనదే ఉంటుందని కాంగ్రెస్

దిశ, మక్తల్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టులో ఏకాభిప్రాయంతో వ్యక్తి ఎంపిక చేసుకుంటే రెబల్ పోటీ లేకుండా గెలుపు మనదే ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. దీనిని చాలా వరకు కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారు. ఇదే పద్దతి బాగుందని బీఆర్ఎస్ కూడా పోటీ చేసే స్థానాల్లో ఒకే అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ పద్దతులు ఏమి పాటించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను మండల స్థాయి నాయకులు అధిష్టానానికి పంపించినట్టు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి ఎంపీగా రాజకీయ ఎత్తుగడలతో తలపడిన బీజేపీ నాయకురాలు కి జిల్లాలో మంచి పేరు ఉండటంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ ఈ పార్టీ కి కూడా రెబల్ బెడద తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ అభ్యర్థిగా ఎవరినీ నిలిపినా రెబల్స్ ని బరిలో నుంచి తప్పించడం కష్టమనే స్పష్టంగా అర్థమవుతోంది.






