అమరచింతలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్

by Bhoopathi Nagaiah |

అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ కావడంతో పట్టణంలో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి.

అమరచింతలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో /అమరచింత: మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణస్వీకారం సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింతలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం10 వార్డులు ఉన్న ఈ మునిసిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తలా మూడు స్థానాలు, ఇతరులు మరొక స్థానంలో గెలుపొందడంతో ఏ పార్టీకి మెజారిటీ లభించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చర్చలు జరిగాయి. ఇరు పార్టీల సభ్యులు కలిస్తే అధికారం పీఠం బీఆర్ఎస్, బీజేపీ కూటమికి దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్‌కు చెందిన ఓ సభ్యురాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోతుందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమె భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు విషమిస్తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. కౌన్సిలర్ భర్తను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ స్థానంలో మంత్రి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటర్ గా పేరు నమోదు చేసుకోవడం, సొంత పార్టీ సభ్యులు ముగ్గురికి తోడు, బీఆర్ఎస్, సీపీఎంకు చెందిన సభ్యులు జత కలవడంతో అధికారానికి కావలసిన ఆరుగురు సభ్యుల మెజారిటీ దక్కినట్లు అయ్యింది. ఈ మునిసిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story