త‌ల్లి సంవ‌త్స‌రికానికి వ‌చ్చి ఇద్ద‌రు కొడుకులు మృత్యువు ఒడిలోకి..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-11 14:39:35  IST  )

త‌ల్లి సంవ‌త్స‌రికానికి వ‌చ్చి ఇద్ద‌రు కొడుకులు మృత్యువు ఒడిలోకి..!
X

దిశ‌, అడ్డాకుల : తల్లి సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు కొడుకులు మృత్యువు ఒడిలోకి వెళ్లిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బ‌లీదుప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మంద మ‌ణ‌మ్మ‌, యాద‌య్య దంప‌తుల‌కు న‌లుగురు సంతానం. గ‌త సంవ‌త్స‌రం కింద‌ట మ‌ణ‌మ్మ మ‌ర‌ణించింది. దీంతో మ‌ణ‌మ్మ సంవ‌త్స‌రికం కోసమ‌ని కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్ నుంచి సొంత ఊరు వ‌చ్చారు. ఈనెల 10న బ‌లీదుప‌ల్లిలో సంవ‌త్స‌రిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం గ్రామ శివారులో ఉన్న చెక్ డ్యామ్ వ‌ద్ద సంవ‌త్స‌రిక పూజ‌కు ఉప‌యోగించిన పండ్లు, పూలు చెరువులో వేస్తుండ‌గా.. కాలు జారి తొలుత సుధాక‌ర్ అనే వ్య‌క్తి చెరువులో ప‌డిపోతుండ‌గా.. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న సోద‌రుడు జ‌గ‌న్(19) , సుధాక‌ర్ ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. వీరిద్ద‌రూ చెక్ డ్యామ్ లో ప‌డి కొట్టుకుపోతుండ‌గానే వీరిని మ‌రో సోద‌రుడు మంద కుమార్ నీటిలో నుంచి బ‌య‌టికి తీశాడు. అయితే సుధాక‌ర్ అప్ప‌టికే చ‌నిపోగా.. జ‌గ‌న్(19) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండ‌గా ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడ‌ని మృతుడు సుధాక‌ర్ భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story