- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధితుడి నుంచి లంచం డిమాండ్.. తెలకపల్లి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురిని కేసు నుంచి తప్పిస్తానంటూ రూ.60 వేలు డిమాండ్ చేయడంతో ఎస్సైపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి : పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురిని కేసు నుంచి తప్పిస్తానంటూ రూ.60 వేలు డిమాండ్ చేయడంతో ఎస్సైపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ పూర్తి విచారణ జరిపిన అనంతరం ఎస్సై వసురాం నాయక్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్ 27న నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామ శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ.. తెలకపల్లి పోలీసులకు చిక్కారు. కాగా, ఆ కేసు నుంచి తప్పిస్తానంటూ తెలకపల్లి ఎస్సై వసురాం నాయక్, మరో కానిస్టేబుల్ బాధితుల నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా, డబ్బు ఇచ్చుకోలేక బాధితులు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌కు సదరు ఎస్సైపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం వసురాం నాయక్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






