- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాష్ రూం వెళ్తూ జారిపడి బాలుడు మృతి..
by Kodari Anjali |
వాష్ రూంకి వెళ్తూ ప్రమాదశావత్తూ కింద జారిపడి బాలుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన వెల్గొండ గ్రామంలో జరిగింది.

X
దిశ, బిజినేపల్లి: మండల పరిధిలోని వెల్గొండ గ్రామానికి చెందిన ఈర్ల నాగరాజు (15) అనే బాలుడు మంగళవారం తెల్లవారుజామున వాష్ రూంకి వెళ్తూ ప్రమాదశావత్తూ కింద జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈర్ల మల్లయ్య చెన్నమ్మలకు దంపతులకు నాగరాజు ఒక్కగానొక్క కుమారుడు. ఈ బాలుడు బిజినాపల్లి మండలం, పాలెం గ్రామంలో గల న్యూ లిటిల్ రోజెస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాష్ రూం వస్తుందని బాలుడు ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డికి వెళ్ళబోయాడు. నిద్ర మబ్బులో ఉన్న బాలుడు కింద ఉన్న నేలను సరిగ్గా చూసుకోక, తట్టుకొని కింద పడడంతో గుండె భాగంలో, తలకు బలమైన గాయం కావడంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. బాలుడి మృతి చెందడంతో గ్రామస్తులు, తల్లిదండ్రుల కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story






