రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రికీ గాయాలు

by Ratna Kumari |

దిశ‌, ఖిల్లా గ‌ణ‌పూర్ : ట్రాక్ట‌ర్- స్కూటీ ఢీ కొని ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం ఖిల్లా ఘ‌న‌పూర్ మండ‌ల కేంద్రంలో

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రికీ గాయాలు
X

దిశ‌, ఖిల్లా గ‌ణ‌పూర్ : ట్రాక్ట‌ర్- స్కూటీ ఢీ కొని ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం ఖిల్లా ఘ‌న‌పూర్ మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మాహమ్మద్ హుస్సేన్ పల్లి నుంచి మండల కేంద్రానికి రాములు సత్యన్నారాయ‌ణ‌ స్కూటీపై వస్తున్నసమయంలో ఒక మలుపు దగ్గర పొలం పనులు ముగించుకొని తన ట్రాక్టర్ పై తిరుపతయ్య తిరిగి గ్రామానికి ట్రాక్టర్ పై వస్తుండగా ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్ స్కూటీకి బలంగా తగిలింది. స్కూటీ పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి కాలు విరిగిపోవడంతో ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తరలించారు.

Next Story