- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
దిశ, వనపర్తి రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైన సంఘటన వనపర్తి మండల పరిధిలోని నాచహళ్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మహ్మద్ షకీల్ టీచర్ గా పని చేస్తాడు.

X
దిశ, వనపర్తి రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైన సంఘటన వనపర్తి మండల పరిధిలోని నాచహళ్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మహ్మద్ షకీల్ టీచర్ గా పని చేస్తాడు. తన స్నేహితులతో కలిసి కోదండపూర్ గ్రామం నుంచి వనపర్తికి టీఎస్ 32డీ7261 నెంబర్ గల కారులో వెళ్తుండగా గ్రామ శివారులోని రైస్ మిల్లు ముందు నెంబర్ లేని హీరో హోండా పై చింతకుంట మహేష్ (23), ర్యాపాని శివకుమార్ (22) వేగంగా వనపర్తి నుంచి పెబ్బేర్ వైపు వస్తున్నారు. వీరు అజాగ్రత్తగా బైకు నడుపుతూ ముందు వస్తున్న కారు ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరూ కింద పడటంతో వీరికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






