స్మ‌శాన వాటిక వ‌ద్ద‌ బోరు మోటార్ చోరీ

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ప‌రిధిలోని గొల్ల‌ప‌ల్లి గ్రామంలోని స్మ‌శాన వాటిక వ‌ద్ద ఉన్న బోరు మోటార్ ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు చోరీ చేశారు.

స్మ‌శాన వాటిక వ‌ద్ద‌ బోరు మోటార్ చోరీ
X

దిశ‌, మ‌క్త‌ల్ : గ్రామ‌స్తుల అవ‌స‌రాల కోసం ఊరు బ‌య‌ట స్మ‌శానం ద‌గ్గ‌ర బోరులో ఉన్న మోటార్ ని సోమ‌వారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశారు. చోరీకి గురైన మోటార్ విలువ దాదాపు రూ.50వేలు ఉంటుంద‌ని స‌ర్పంచ్ సూర్య‌కుమార్ తెలిపారు. మ‌క్త‌ల్ మండ‌ల ప‌రిధిలోని గొల్ల‌ప‌ల్లి గ్రామానికి కొత్త‌గా ఎన్నిక‌న స‌ర్పంచ్ గ్రామ అవ‌స‌రాల కోసం స్మ‌శానికి కొద్ది దూరంలో గ్రౌండ్ వాట‌ర్ స‌మృద్ధిగా ఉండ‌టంతో గ్రామ‌పంచాయ‌తీ ఆధ్వ‌ర్యంలో బోరు కు డ్రిల్ చేయ‌డంతో పాటు దాదాపు రెండున్న‌ర ఇంచుల నీళ్లు ఉండ‌టంతో క‌రెంట్ మోటార్ బిగించారు. ఈ నేప‌థ్యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మోటార్, స్టార్ట‌ర్, కేబుల్ వైర్ ను దొంగిలించారు. ఉద‌యం మోటార్ ని స్టార్ట్ చేద్దామ‌ని కొంద‌రూ వెళ్లి చూడ‌గా.. ఖాలీ కేసింగ్ పైపు మాత్ర‌మే క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. గ్రామ ప్ర‌జ‌ల నీటి అవ‌స‌రాల నిమిత్తం వేసిన నీటి బోరును దొంగిలించ‌డం పై గ్రామ‌స్తులు ఆశ్చ‌ర్య‌పోయారు. స‌ర్పంచ్ సూర్య‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story