- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొలెరో వాహనం, బైక్ ఢీ..స్పాట్ లోనే
మండల పరిధిలోని వడ్డేమాన్ - నెల్లికొండి గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పంప

X
దిశ, చిన్న చింతకుంట : మండల పరిధిలోని వడ్డేమాన్ - నెల్లికొండి గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పంపల్లికి చెందిన తెలుగు మధు (35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు మధు మోటార్ సైకిల్ పై తన గ్రామానికి వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. బొలెరో వాహనాన్ని వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే మధు ప్రమాదానికి గురై మరణించాడు.. అతని కుటుంబానికి న్యాయం చేయాలని రాత్రి పొద్దు పోయేదాకా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ మేరకు చిన్నచింతకుంట ఎస్సై ఓబుల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Next Story






