మొక్క‌జొన్న చెత్త‌లో కాలిన మ‌హిళా మృత‌దేహం పార్వ‌త‌మ్మ‌గా గుర్తింపు

by Ratna Kumari |

మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం మొక్కజొన్న చెత్తలో కాలిన మహిళా మృతదేహం లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మొక్క‌జొన్న చెత్త‌లో కాలిన మ‌హిళా మృత‌దేహం పార్వ‌త‌మ్మ‌గా గుర్తింపు
X

దిశ‌, బిజినేప‌ల్లి : మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం మొక్కజొన్న చెత్తలో కాలిన మహిళా మృతదేహం లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పై విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహం ఖానాపూర్ గ్రామానికి చెందిన బోనమోని పార్వతమ్మగా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహం పార్వతమ్మగా గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు. గతంలో తన ప్రియుడితో కలిసి తన భర్తను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వీరిద్దరూ ఇప్పుడు పార్వతమ్మ చనిపోవడంతో ఆమెను తన ప్రియుడే పతకం ప్రకారం చంపాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుమారుడు భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంషాద్దీన్ తెలిపారు.

Next Story