అన్ని దానాల కంటే ర‌క్త‌దానం గొప్ప‌ది : ఎమ్మెల్యే మేఘారెడ్డి

by Ratna Kumari |

అన్ని దానాల కంటే ర‌క్త‌దానం చాలా గొప్ప‌ది అని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం యువ‌శ‌క్తి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మెగా ర‌క్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

అన్ని దానాల కంటే ర‌క్త‌దానం గొప్ప‌ది : ఎమ్మెల్యే మేఘారెడ్డి
X

దిశ, వనపర్తి టౌన్: అన్ని దానాల కంటే ర‌క్త‌దానం చాలా గొప్ప‌ది అని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం యువ‌శ‌క్తి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మెగా ర‌క్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్పి ర‌క్త‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం ఎంతో అభినందనీయం అన్నారు. ప్రజా సేవయే పరమావధిగా సాగుతున్న ఈ ప్రస్థానంల, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసే రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం, నాకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే త‌న‌పై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అగారం ప్రకాష్ , లక్ష్మారెడ్డి , క్యామ శ్రీరాములు , నాగేష్ , గౌస్, మహేష్, రవి, థావుర్య నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story