ఫేక్ ఐడి తో బ్లాక్ మెయిల్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిడ్జిల్ : ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడి తో యువతి ఫోటోలు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపిన‌ వివరాల ప్రకారం.. మిడ్జిల్

ఫేక్ ఐడి తో బ్లాక్ మెయిల్
X

దిశ, మిడ్జిల్ : ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడి తో యువతి ఫోటోలు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపిన‌ వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన అవేజ్ అమ్మాయి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఐడీ క్రియేటివ్ చేశారు. అదే గ్రామానికి చెందిన యువతి కి సంబంధించిన ఫోటోలు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడ‌ని తెలిపారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువతి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గతంలో కూడా అవేజ్ అదే యువతినీ వేధింపులకు గురి చేస్తున్నడనే విషయంలో జైలుకు వెళ్ళారు. అయినా అతని ప్రవర్తనలో ఎలాటి మార్పు రాలేదు. అదే యువతి పై మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు పెడుతున్నాడు. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story