స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చార‌కొండ : స్థానిక సంస్థలకు జరిగే అన్ని ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని మండల బీజేపీ అధ్యక్షుడు చెలమోని కృష్ణ తెలిపారు. బీజేపీ

స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ
X

దిశ‌, చార‌కొండ : స్థానిక సంస్థలకు జరిగే అన్ని ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని మండల బీజేపీ అధ్యక్షుడు చెలమోని కృష్ణ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆదేశాల మేరకు చారకొండ మండల కేంద్రం లో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల ఎన్నికలలో బీజేపీ పోటీకి సిద్ధం గా ఉందని తెలిపారు. బీజేపీ పైనే ప్రజల అభివృద్ధి ఆకాంక్షలు ఉన్నాయని తెలిపారు. ప్రచారం లో భాగంగా ప్రతి ఇంటికి బీజేపీ చేసిన అభివృద్ధి పనులను చేరవేసీ బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంద‌న్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు హరిబాబు, వేణు శర్మ, మండల ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్, శంకర్, మహేష్ రెడ్డి .ఎదిరే రవీందర్, రవి, చంద్రాఅభ్యర్థులు ప్రజలకు అండగా ఉంటారని, బడుగు బలహీన వర్గ పేద మధ్య తరగతి ప్రజలకు సేవ చేయడమే బిజెపి పార్టీ లక్ష్యమని మని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు హరిబాబు, వేణు శర్మ, మండల ఉపాధ్యక్షులు కారెడ్డి, పెద్దిరాజు ,నరేష్ , పూల్ సింగ్, మల్లేష్, రాములు,సైదులు, రఘు,మహేందర్, జంగయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Next Story