- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్డలూడదీసి కొట్టారంటూ బీజేపీ నాయకులు ధర్నా
దిశ, వెల్దండ : సీఐ అమానుషంగా వ్యవహరించి గుడ్డలూడదీసి కొట్టారంటూ వెల్దండ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. మండల పరిధిలోని

దిశ, వెల్దండ : సీఐ అమానుషంగా వ్యవహరించి గుడ్డలూడదీసి కొట్టారంటూ వెల్దండ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా దుర్గామాత మండపం వద్ద వేసిన ఫ్లెక్సీ విషయంలో ఓ పార్టీ నేత ఫ్లెక్సీ తొలగించడంతో జరిగిన వివాదంలో మాట మాట పెరిగి పోలీస్ స్టేషన్ వరకు పంచాయితీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేత పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు గజ్జె హరిప్రసాద్ గౌడ్ పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయం పై పోలీసులు అతడినీ పిలిపించి చితబాదారని వాపోయాడు. దీంతో సీఐ అమానుషంగా బాదాడని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. మరోవైపు బీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పోలీస్ స్టేషన్ కి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు ధర్నా విరమింప జేశారు.






