- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి పట్టణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ
మంగళవారం వనపర్తి పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

దిశ,వనపర్తి: మంగళవారం వనపర్తి పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు చేపట్టారు. ఇక ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకొని, బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా సోమవారం బీజేపీ నాయకులు వివేకానంద చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ తరుణంలోనే బీజేపీ నాయకులును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, కేసులకు నిరసిస్తూ రేపు మంగళవారం బిజెపి పట్టణ బందు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యు రెడ్డి వెంకట్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు,వారణాసి కల్పన, జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు బా శెట్టి శ్రీనివాసులు, పద్మ, జిల్లా కార్యదర్శి బాల్నగర్ సూరి ,శివారెడ్డి, రామ్ రెడ్డి, సరోజ కార్యాలయం సెక్రటరీ కుమార్,మాజీ పట్టణ అధ్యక్షులు బచ్చు రాములు, బోయల రాము,జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షులు కరీం, పట్టణ ప్రధాన సుగురు రాములు,అరవింద్, రాయన్న సాగర్,పట్టణ ఉపాధ్యక్షులు అంజి, ఉపేందర్, కార్యదర్శి కడమంచి శివ, కోశాధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.






