ఉదండపూర్ లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు

by Ratna Kumari |

జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామం పొలంలో బీరప్ప స్వామి ఉత్సవాలను గ్రామ కురుమ యాదవులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కామరాతి కళ్యాణం మహోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఉదండపూర్ లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామం పొలంలో బీరప్ప స్వామి ఉత్సవాలను గ్రామ కురుమ యాదవులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కామరాతి కళ్యాణం మహోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. సోమవారం గ్రామస్తులంతా బోనాలంతా ఊరేగింపుగా వచ్చి కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు. కురుమ యాదవులు బండారు కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టారు కళ్యాణం బండారు ముఖ్యమైన ఘట్టం కావడంతో గ్రామంలో సందడి నెలకొంది. బీరప్పను దర్శించుకున్న ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఉదండాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప పండుగ ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వేర్వేరుగా ఉదండాపూర్ గ్రామానికి చేరుకొని బీరప్ప దేవాలయంలో బీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప స్వామి ఆశీర్వాదం గ్రామదేవతల ఆశీర్వాదం ప్రజల అందరిపై ఉండాలని గ్రామ దేవతల పండుగలు జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు. కురుమ యాదవులకు బీరప్ప పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story