- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా

బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి
- రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా
- మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పరిశీలన
దిశ, మద్దూరు : మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి ఆమె మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరిగి రోగులతో మాట్లాడారు. వైద్య సేవల గురించి రోగులతో వాకబు చేశారు. ఆమెను కలిసిన కొంతమంది ఓపి సేవలు మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిలిపేస్తున్నారని, అలాగే పేషెంట్లకు మధ్యాహ్నం మరియు రాత్రి వేళల్లో భోజనం అందించడం లేదని, ఓకే బెడ్ పై ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలకు గల కారణాలను అడిగి తెలుసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో కలెక్టర్, స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ముఖ్య అధికారులతో ఆస్పత్రి అభివృద్ధి, ప్రగతి,అవసరమైన వసతి సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. బిల్డింగ్, , డ్రగ్స్ పెసిలిటీ, ఎన్ సీడీ స్క్రీనింగ్, టీబీ టెస్ట్, తదితర వాటి గురించి చర్చించారు. ఆస్పత్రికి వెయిటింగ్ కుర్చీలు, బెడ్స్, అవసరమని ఆర్ ఎం వో పావని కోరారు. ఇంకా ఏమైనా అవసరమా ఉంటే ప్రతిపాదనలు పంపించాలని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ క్రిస్టినా సూచించారు.






