ఆటోను ఢీ కొట్టిన బైకు.. ఆటో డ్రైవ‌ర్ కి తీవ్ర‌గాయాలు..!

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : ఆటోను బైకు ఢీ కొట్ట‌డంతో ఆటో డ్రైవ‌ర్ కి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. బుధవారం సాయంత్రం గోపాల్ పేట

ఆటోను ఢీ కొట్టిన బైకు.. ఆటో డ్రైవ‌ర్ కి తీవ్ర‌గాయాలు..!
X

దిశ‌, గోపాల్ పేట : ఆటోను బైకు ఢీ కొట్ట‌డంతో ఆటో డ్రైవ‌ర్ కి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. బుధవారం సాయంత్రం గోపాల్ పేట నుంచి ఏదుట్ల గ్రామానికి వెళ్తున్న బైకు, వనపర్తి నుంచి గోపాల్ పేట కు వ‌స్తున్న ప్యాసింజర్ ఆటో ను స‌రిగ్గా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందుకి రాగానే బలంగా బైక్ ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఆటోలో ఉన్న మ‌హిళ‌కు దెబ్బ‌లు తాకిన‌ట్టు, ఆటోలో అద్దాలు ప‌గిలి స్టీరింగ్ కూడా పాడైన‌ట్టు స్థానికులు తెలిపారు. అంబులెన్స్ ద‌గ్గ‌ర ఉన్న పోలీసుల‌కు స‌మాచారం అందించి ఆటో డ్ర‌వైర్ ను, మ‌హిళను అంబులెన్స్ స‌హాయంతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు స్థానికులు వెల్ల‌డించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story