- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే 'ఆర్ఎస్ఎస్' లక్ష్యం : బీజాపూర్ కరేంద్ర నాథ్
దిశ, పెద్ద కొత్త పల్లి : వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే 'ఆర్ఎస్ఎస్' లక్ష్యమని బీజాపూర్ కరేంద్ర నాథ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా

దిశ, పెద్ద కొత్త పల్లి : వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే 'ఆర్ఎస్ఎస్' లక్ష్యమని బీజాపూర్ కరేంద్ర నాథ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో గల పీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో విజయ దశమి ఉత్సవాలను నిర్వహించారు. బీజాపూర్ కరేంద్రనాథ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. 100 సంవత్సరాల కింద ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తి నిర్మాణమే లక్యంగా పని చేస్తూ ఎంతో మంది యువకులను దేశ భక్తులుగా తయారు చేసిందన్నారు. 100 సంవత్సరాల ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు, నిషేధాలను ఎదుర్కొందన్నారు. దేశంలో ఎక్కడ ఏదైనా ప్రకృతి, విపత్తులు సంభవించినా ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా సేవలు అందిస్తుందని తెలిపారు.
1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహా బత్తుల నవీన్, డాక్టర్ కృష్ణా రెడ్డి, శ్యామ్ సుందర్, పోల కిషోర్, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, విజయభాస్కర్ శర్మ, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మహేష్, లక్ష్మీనరసింహా చారి, బాలమల్లయ్య, తిరుపతయ్య, రామమల్లయ్య, లింగం, శ్రీధర్, శేఖర్, మార్కండేయ పాల్గొన్నారు.






