- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట పొలాల్లో పెద్ద పులి జాడలు
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ సోమశీల సెక్షన్ సరిహద్దు గ్రామం ఎంగంపల్లి తండా గ్రామ శివారు పంట పొలాల్లో పెద్ద పులి సంచారం ఉండడంతో అటవీ శాఖ అధికారులు శుక్రవారం

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ సోమశీల సెక్షన్ సరిహద్దు గ్రామం ఎంగంపల్లి తండా గ్రామ శివారు పంట పొలాల్లో పెద్ద పులి సంచారం ఉండడంతో అటవీ శాఖ అధికారులు శుక్రవారం అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు డిఎఫ్ఓ, ఎఫ్డీఓ, ఎఫ్ఆర్వో ఆదేశాల మేరకు కొల్లాపూర్ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పెద్ద పులి సంచరించిన ప్రదేశాల్లో పులి పాదాల ముద్రలను గుర్తించారు. ఎంగంపల్లి తండా గ్రామ పరిసర ప్రాంతాలు, గ్రామస్తుల వ్యవసాయ పొలాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు అధికారులు విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా పొలాల్లో కనిపించిన పాదముద్రలు, ఇతర ఆనవాళ్లను సాంకేతికంగా పరిశీలించిన అనంతరం అవి పెద్ద పులికి చెందిన జాడలేనని అటవీ శాఖ అధికారులు కాశన్న, ముజీబ్ ఘోరి నిర్ధారించారు. ఈ పాద ముద్రలు పెద్ద పులి జాడలేనని అధికారులు దృవీకరించడంతో కృష్ణా నది తీర గ్రామస్తుల్లో భయాందో దోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు భయబ్రాంతులు గురికుండా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంగంపల్లి తండా తో పాటు అటవీ సరిహద్దు గ్రామాలైన సోమశిల, అమరగిరి, ఎంగం పల్లి తాండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహనా కల్పిస్తూ వివరించి, అపోహలు దూరం చేస్తూ చాటింపు కార్యక్రమాలు నిర్వహించారు. పులి సంచారం సహజ అటవీ వ్యవస్థలో భాగమేనని, అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తోందని అధికారులు గ్రామస్తులకు స్పష్టం చేశారు.ఎంగంపల్లి గ్రామ సర్పంచ్ గోపి నాయక్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు కాశన్న, ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ముజీబ్ ఘోరి, సిబ్బంది సమక్షంలో ఎంగంపల్లి తండాలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చిన్న పిల్లలను అటవీ ప్రాంతాల వైపు పంపవద్దని, గొర్లు,పశువులను కాపాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పులి కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు కోరారు.ఎవరు కూడా పంట పొలాల్లో ఉచ్చులు గాని, కరెంట్ గాని అమర్చితే అటవీ చట్టం 1972 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని అటవీ అధికారులు హెచ్చరించారు.






