రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన పెద్ద కొత్త పల్లి విద్యార్థులు

by Ratna Kumari |

దిశ, పెద్ద కొత్త పల్లి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన పెద్ద కొత్త పల్లి విద్యార్థులు
X

దిశ, పెద్ద కొత్త పల్లి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎన్నికయ్యారు. విద్యార్థి డి. మనిష్ కుమార్ (9 వ తరగతి) 55 కేజీ ల విభాగంలో స్కాచ్ 40కేజీలు క్లీన్ & జర్క్ 62 కేజీలు మొత్తం 102 కేజీ ల బరువెత్తి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. అలాగే 69 వ ఎస్ జీఎఫ్ఐ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్ 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్ విభాగం లో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పుట్ట చందన 40 కేజీ ల క్యాటగిరి లో స్నాక్స్ 25 కేజీలు క్లీన్ అండ్ జరుకు 30 కేజీలు మొత్తం 55 కేజీల బరువెత్తి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైంది. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్ 17 బాలుర వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇదే హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కే, రామకృష్ణ 55 కేజీల విభాగంలో స్నాక్స్ 40 కేజీల క్లీన్ అండ్ జర్క్ 65 కేజీలు మొత్తం 105 కేజీల బరువెత్తి ఉమ్మడి జిల్లా లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కి రామకృష్ణ ఎంపికయ్యాడు. ఒకే పాఠశాల నుంచి (ఒక బాలిక, ఇద్దరు బాలురు) ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికకావడం పట్ల పాఠశాల ప్రాధానోపా ధ్యాయుడు, ఇంచార్జి ఎంఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు బాల సుబ్రహ్మణ్యం తో పాటు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.

Next Story