- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ
మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ స్థాపనకు బుధవారం చెరుకుపల్లి చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ , కామ్రేడ్ ధర్మబిక్షం విగ్రహల స్థాపనకు గౌడ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.

దిశ, చారకొండ : మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ స్థాపనకు బుధవారం చెరుకుపల్లి చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ , కామ్రేడ్ ధర్మబిక్షం విగ్రహల స్థాపనకు గౌడ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుండె విజెందర్ గౌడ్ మాట్లాడుతూ ఆత్మగౌరవ పోరాట యోధుడు, బహుజన సామాజిక రాజ్య నిర్మాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేటి యువత కు ఆదర్శప్రాయుడని, సమాజంలో అన్ని రంగాలలో నేటికి అసమానతలు కొనసాగుతున్న పరిస్థితి లో యువతకు పాపన్న గౌడ్ ను స్పూర్తిగా తీసుకోవాలని, ఏ కార్యక్రమమైన అందరి సమన్వయం తో సాధించాలని ఆయన సూచించారు.
గౌడ వృత్తి దారుల అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై అలుపెరుగని రాజకీయ పోరాటాలు చేసి అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మానవతా వాది కామ్రేడ్ ధర్మబిక్షం అని స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపారు.అనంతరం సర్పంచ్ గుండె విజెందర్ గౌడ్ విగ్రహాల స్థాపన నిమిత్తం లక్ష రూపాయల విరాళం అందజేయడంతో పాటు పలువురు విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో గౌడ్ సంఘం సీనియర్ నాయకులు జెల్ల కృష్ణయ్య గౌడ్, గుండె జంగయ్య గౌడ్, యాసారపు అశోక్ గౌడ్, కొండల్ గౌడ్, కలగోని నారయ్య గౌడ్, గుండె వెంకట్ గౌడ్, జమ్మికింది బాల్ రాం గౌడ్, కొండల్ గౌడ్, సీపీఐ నాయకులు శ్రీనివాస్, దళిత సంఘాల నాయకుడు రాధాకృష్ణ మహా రాజ్, అర్జున్ గౌడ్, జనార్దన్ గౌడ్, సత్యం గౌడ్, గణేష్, గుండె యాదగిరి, మహేష్, సురేష్, గుండే శ్రీను, చండీశ్వర్, కలగోని కిరణ్ గౌడ్, గుండె శివ పాల్గొన్నారు.






