- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్డి సేవా సమితి భవన నిర్మాణానికి భూమి పూజ
by Ratna Kumari |
దిశ, కొల్లాపూర్ : పాలమూరు రెడ్డి సేవా సమితి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణ శివారులో ఆఫీసు నిర్మాణం కోసం ఆ సంఘం నాయకులు భూమి పూజ చేశారు. కొల్లాపూర్ రెడ్డి

X
దిశ, కొల్లాపూర్ : పాలమూరు రెడ్డి సేవా సమితి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణ శివారులో ఆఫీసు నిర్మాణం కోసం ఆ సంఘం నాయకులు భూమి పూజ చేశారు. కొల్లాపూర్ రెడ్డి సేవా సమితి సలహాదారు ఆధ్వర్యంలో ఎద్దుల ప్రతాపరెడ్డి నేతృత్వంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దుల ప్రతాపరెడ్డి మాట్లాడారు. కొల్లాపూర్ రెడ్డి సేవా సమితి ఆఫీసు భవనం నిర్మాణం కొరకు కృషి చేస్తామన్నారు. ఇందుకు అందరి సహాయ, సహాకారాలు అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి నాయకులు బిచ్చా రెడ్డి, ఎల్లూరు బండి వెంకటరెడ్డి, మల్లయ పల్లి మెర్వారెడ్డి, అచ్యుతా రెడ్డి సంజీవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,భీమిరెడ్డి, నర్సాపల్లి నరసింహారెడ్డి, సత్య రెడ్డి పాల్గొన్నారు.
Next Story






