- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్ కి బాత్ దేశ ప్రజలకు ప్రేరణిస్తుంది : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్
దిశ, అడ్డాకుల : భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ దేశ ప్రజలకు ప్రేరణిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్ తెలిపారు.

దిశ, అడ్డాకుల : భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ దేశ ప్రజలకు ప్రేరణిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్ తెలిపారు. మండల పరిధిలోని రాచాల గ్రామంలో ఆదివారం దూరదర్శన్ లో 127వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్ గ్రామస్తులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమం దేశ ప్రజలకు ప్రేరణనిచ్చే అనేక అంశాలను స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ఎంత ముఖ్యమో ఉద్ఘాటిస్తుందని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కందుర్ రమేష్, పిల్లి సూర్యనారాయణ, ఆంజనేయులు, తిరుపతి నాయక్, రాఘవేందర్, కందూర్ మాజీ ఉపసర్పంచ్ శంకర్, కౌకుంట్ల ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.






