నాకు భగీరథుడే ఆదర్శం- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

by Ratna Kumari |

దిశ, పెద్దమందడి : తనకు భగీరథుడే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో

నాకు భగీరథుడే ఆదర్శం- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
X

దిశ, పెద్దమందడి : తనకు భగీరథుడే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టుదలలో భగీరథుడే ప్రతి ఒక్కరికిఆదర్శప్రాయంఅన్నారు.తాను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలుపరిచి తెలంగాణను,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికే రోల్డ్ మాడల్ నిలిచారన్నారు.రిజర్వేషన్ల ప్రకారం సగరులకు అవకాశం ఉన్నచోట గుర్తింపుని ఇస్తామన్నారు. పెద్దమందడి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పర శేఖర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హరికిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చీర్ల విష్ణు సాగర్, జిల్లా అద్యక్షులు, తిరుపతయ్య, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, ప్రభాకర్, రాధాకృష్ణ, లోకేష్, సుగురు మురళి, తదితరులు పాల్గొన్నారు

Next Story