- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త.. ఎంపీ డీ.కే.అరుణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఘాటుగా హెచ్చరించారు.

దిశ, కొత్తకోట : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఘాటుగా హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రపంచమంతా నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే నీలాంటి నాయకులు నరేంద్ర మోడీని విమర్శించే హక్కు లేదన్నారు. కొత్తకోట పట్టణ ప్రాంత ప్రజలు చైతన్య వంతులని, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసు నని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఒక్క సీటైన గెలుసుకోండి అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం నిధులు లేకపోతే రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయలేరని తెలిపారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి అర్ధరాత్రి గుంజుకుపోయి కేసీఆర్ జైల్లో వేశారని.. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి పై బీజేపీ కక్షసాధింపు చేయాలనుకుంటే, ఓటుకు నోటు కేసు చాలు అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయదలచుకోలేదని చెప్పారు. శత్రు దేశాల కుట్రలను ప్రధాని మోడీ తిప్పి కొడుతున్నారని అది గమనించకుండా రాహుల్ గాంధీ వేరే దేశాలలో మన దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కొత్తకోట మున్సిపాలిటీకి అమృత్ 2.0 కింద నిధులిచ్చిందని,కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదల సంక్షేమ, అభివృద్ధి కోసం మంజూరు చేస్తుందన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే.. బీజేపీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, కొత్తకోట మున్సిపాలిటీ లో కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ చార్జి డోకూర్ పవన్ కుమార్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్ చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి, ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్ పాల్గొన్నారు.






