- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడి వ్యాపారులతో జాగ్రత్త..!
బంగారం తాకట్టు పెట్టుకునే వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలని కడ్తాల సీఐ గంగాధర్ తెలిపారు. కడ్తాల్ పట్టణ కేంద్రంలో ఓ మార్వాడి వ్యాపారి గోల్డ్ బిజినెస్ మోసం గురించి వెలుగులోకి వచ్చింది.

దిశ, ఆమనగల్/ కడ్తాల్ : బంగారం తాకట్టు పెట్టుకునే వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలని కడ్తాల సీఐ గంగాధర్ తెలిపారు. కడ్తాల్ పట్టణ కేంద్రంలో ఓ మార్వాడి వ్యాపారి గోల్డ్ బిజినెస్ మోసపూరితం బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మార్వాడి బర్ఫ నన్నారం (29) కడ్తాల్ లో నివసిస్తూ అతని సోదరుడు తో కలిసి గణేష్ పాన్ బ్రోకర్స్ పేరుతో బంగారం తాకట్టు పెట్టుకునే వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి సుమారు 500 గ్రాముల వరకు బంగారాన్ని తాకట్టు పెట్టించుకున్నట్లు, అదేవిధంగా బాధితుల నుంచి తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని హైదరాబాద్ లోని వివేక్ పాన్ బ్రోకర్స్ వద్ద తిరిగి తాకట్టు పెట్టి డబ్బులు స్వీకరించి, తమ అవసరాలకు డబ్బులను వాడుకున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అతను పరారీలో ఉన్నాడు. బుధవారం సాయంత్రం దాసర్లపల్లి పెద్దమ్మ తండా సమీపంలో ఉన్నాడని సమాచారంతో పట్టుకొని విచారించగా మోసం చేసినట్టు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 2023 నుంచి మండల కేంద్రంలో గణేష్ పాన్ బ్రోకర్స్ పై వస్తున్న ఫిర్యాదులపై విచారిస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ అవసరాల కోసం విలువైన ఆభరణాలను బ్రోకర్ల వద్ద తాకట్టు పెట్టేటప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు.






