ఏడాది కాకముందే జాతీయ రహదారికి గండి.. పాలమూరులో పలుచోట్ల కుంగిపోయిన రోడ్డు..

by Taduka Kalyani |

సంవత్సరం గడవక ముందే కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారికి పలుచోట్ల గండ్లు పడగా, మరికొన్ని చోట్ల కుంగి పోయింది.

ఏడాది కాకముందే జాతీయ రహదారికి గండి.. పాలమూరులో పలుచోట్ల కుంగిపోయిన రోడ్డు..
X

దిశ, మహబూబ్ నగర్: సంవత్సరం గడవక ముందే కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారికి పలుచోట్ల గండ్లు పడగా, మరికొన్ని చోట్ల కుంగి పోయింది. వివరాల్లోకి వెళితే జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం మీదుగా రాయిచూర్ వరకు నిర్మించిన 167 వ జాతీయ రహదారి విస్తరణ పనులను ఏడాది కాలం క్రితమే చేశారు.

అకాల వర్షాలు కురుస్తుండడం, రోడ్డుపై నుంచి వాహనాలు వెళుతుండడంతో పలుచోట్ల కుంగిపోయి గండ్లు పడ్డాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది ప్రమాదాలు జరగకుండా, ఒకచోట పాత సూట్ కేసు, చెట్టు కొమ్మలు, మరికొన్ని చోట్ల చెత్త వేశారు. నాణ్యత పాటించకుండా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు, వాహన చోదకులు ఆరోపిస్తున్నారు.

Next Story