- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోకలి బండతో కొట్టి... బంగారు ఆభరణాలు అపహారణ
రోకలి బండతో కొట్టి బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అందుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

దిశ, నాగర్ కర్నూల్ : రోకలి బండతో కొట్టి బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అందుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన కుమ్మం రాములమ్మ ఎరుకలి గద్దె చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ నెల 2వ తేదీన తెల్కపల్లి లోని బీసీ కాలనీ లో నిద్రిస్తున్నది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె పై దాడి చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహారించారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ధర్యాప్తులో భాగంగా శనివారం బీసీ కాలనీ కల్లు కంపాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు ఓర్సు శ్రీను, (అలియాస్ శివ, సూర్య ) పట్టుకొని విచారించగా.. తానే ఆ మహిళను రోకలి బండతో కొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి బంగారు గుండ్లు, 30 తులాల వెండి కడియాలు, ఫోన్, ఒక బైక్ స్వాధీనం చేసుకొని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ తరలించారు. నిందితుని పై గతంలో మొయినాబాద్, శంషాబాద్ , దుండిగల్, పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. ఇతనిపై పీడి యాక్ట్ కేసు నమోదయి ఉందని తెలిపారు. ఈ చేధించిన తెలకపల్లి ఎస్సై నరేష్ ,కానిస్టేబుల్ లను సీఐ అభినందించారు.






