- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకి
సంక్రాంతి పండుగ సమయంలో తమ ఊర్లకు, బందువుల ఇళ్ల వద్దకు వెళ్లే వారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాబోయే సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జానకి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు తమ ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారం వంటి వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు. అలాగే పొరుగు వారికి గానీ గ్రామ పెద్దలకు కానీ సమాచారం ఇవ్వడం, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్ కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని ఆమె తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, వాహనాలు కానీ, అసాధారణ కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 కానీ 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్పీ జానకి సూచించారు.






