బీసీ రిజర్వేషన్ బిచ్చం కాదు.. బీసీల హక్కు: అంకు సురేంద‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, వంగూర్ : బీసీ రిజర్వేషన్ బిచ్చం కాదు.. బీసీల హక్కు అని బీసీ జిల్లా నాయ‌కులు అంకు సురేంద‌ర్ పేర్కొన్నారు. వంగూర్ మండ‌ల కేంద్రంలో శ్రీశైలం ర‌హ‌దారిపై

బీసీ రిజర్వేషన్ బిచ్చం కాదు.. బీసీల హక్కు: అంకు సురేంద‌ర్
X

దిశ, వంగూర్ : బీసీ రిజర్వేషన్ బిచ్చం కాదు.. బీసీల హక్కు అని బీసీ జిల్లా నాయ‌కులు అంకు సురేంద‌ర్ పేర్కొన్నారు. వంగూర్ మండ‌ల కేంద్రంలో శ్రీశైలం ర‌హ‌దారిపై బీసీ సంఘాల ఆధ్వ‌ర్యంలో శ‌నివారం బంద్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సురేంద‌ర్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని అన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు. ప్రతి మీటింగ్ లలో జెండాలు మోయడానికి, మీ ఫ్లెక్సీలు కట్టడానికి, మీ ఊరేగింపులకు బీసీ బిడ్డలు కావాలి కానీ, అదే బీసీ బిడ్డలకు మాత్రం ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు అర్హతలు లేవా అని ప్ర‌శ్నించారు. మేము ఎంతో..? మాకు అంత‌ కావాలంటూ ఇవాళ బీసీ బంద్ ను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు.

Next Story