బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా డాక్ట‌ర్‌ వెన్న ఈశ్వరప్ప

by Ratna Kumari |

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : హైదరాబాద్ నగరంలోని అశోక్ హోటల్‌లో గురువారం జరిగిన బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కీలక సమావేశంలో గండీడ్ మండలం, పరిగి నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా డాక్ట‌ర్‌ వెన్న ఈశ్వరప్ప
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : హైదరాబాద్ నగరంలోని అశోక్ హోటల్‌లో గురువారం జరిగిన బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కీలక సమావేశంలో గండీడ్ మండలం, పరిగి నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డా. వెన్న ఈశ్వరప్పను తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు. ఈ బాధ్యతల పత్రాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అందజేశారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలకు సంబంధించి మహత్తర నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి కులానికి ఒక కన్వీనర్ లేదా కో-కన్వీనర్ అవకాశం కల్పిస్తూ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయించింది. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలంగాణ బంద్‌ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు ఒకే వేదికపై నిలబడి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా బీసీల రాజ్యాంగబద్ధ హక్కులు సాధించేవరకు అందరూ మద్దతు కొనసాగించాలని సూచించారు.

Next Story