- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు నెలల చిన్నారి మృతి పై ఎండోమెంట్ శాఖ విచారణకు బీసీ కమిషన్ ఆదేశం
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో 2 నెలల చిన్నారి దుర్మరణం సంఘటనపై పూర్తిగా విచారణ జరిపించి 3 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ బీసీ కమిషన్ ఎండో మెంట్ శాఖకు ఆదేశాలు జారీ చెసింది.

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో 2 నెలల చిన్నారి దుర్మరణం సంఘటనపై పూర్తిగా విచారణ జరిపించి 3 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ బీసీ కమిషన్ ఎండో మెంట్ శాఖకు ఆదేశాలు జారీ చెసింది. ఈ మేరకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ సోమవారం ఎండో మెంట్స్ శాఖ కమిషనర్ ఎస్.హరీష్ (ఐఏఎస్) కు ఉత్తరం రాశారు. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామ జాతరలో బీసీ వర్గాల వారికి ఆలయం ప్రవేశం నిరాకరణ కారణంగా జరిగిన గొడవ కారణంగా తొక్కిసలాటలో 2 నెలల శిశువు మరణం ఘటనపై పూర్తిగా విచారణ జరిపి వివరణాత్మక నివేదిక అందజేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఎస్.హరీష్ ను కోరారు. జాతరలో పాల్గొనడానికి నిర్వాహకులు ప్రవేశ రుసుము వసూలు చేసిన అంశంపై సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుల వివక్ష ఆరోపణల నిజానిజాలు, ప్రవేశ రుసుముల వసూలు వంటి విషయంతో పాటు జాతర నిర్వహణకు ఎండో మెంట్స్ శాఖ చేపట్టిన ఏర్పాట్లపై పూర్తి వివరాలతో మూడు (3) రోజుల్లోగా బీసీ కమిషన్‌కు సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు.






