- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిస్వార్థ కాంగ్రెస్ నాయకుడికి సముచిత స్థానం ఇవ్వాలి : బద్దుల అజయ్ యాదవ్
దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన బద్దుల అజయ్ యాదవ్ దశాబ్దంగా కాంగ్రెస్ పార్టీకి

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన బద్దుల అజయ్ యాదవ్ దశాబ్దంగా కాంగ్రెస్ పార్టీకి కష్టసమయంలోనూ కట్టుబడి పనిచేసిన యువ నాయకుడు బద్దుల అజయ్ యాదవ్ కు ఈసారి పార్టీ గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.అచ్చంపేట జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళా రిజర్వ్ కావడంతో, ఆయన సతీమణి బద్దుల మంజుల యాదవ్ కు టికెట్ కేటాయించాలని యాదవ సంఘాలు కోరుతున్నాయి.2014 నుంచి ప్రతిపక్ష కాలంలోనూ పార్టీతో అజయ్ యాదవ్ వెన్నుదన్నుగా నిలబడి, సోషల్ మీడియా విభాగం, యూత్ కాంగ్రెస్ మండల, అసెంబ్లీ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ప్రస్తుత ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కు అండగా పాదయాత్రలు, ధర్నాలు, నిరసనల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారు అని,పార్టీకి కష్టకాలంలో నిలబడ్డ నాయకుడికి గౌరవం ఇవ్వాలి అని కాంగ్రెస్ శ్రేణులు, మంజుల యాదవ్ కు టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నాయి అని ఓ ప్రకటనలో తెలిపారు.






