దురలవాట్లుతోనే క్యాన్సర్ కు ప్రధాన కారణం

by Ratna Kumari |

పొగత్రాగడం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్ తీసుకోవడం లాంటి అనేక దురలవాట్లతోనే క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

దురలవాట్లుతోనే క్యాన్సర్ కు ప్రధాన కారణం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పొగత్రాగడం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్ తీసుకోవడం లాంటి అనేక దురలవాట్లతోనే క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. బుధవారం 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' సందర్భంగా మహబూబ్ నగర్ 'ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల క్లబ్' ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ అవగాహన పై నిర్వహించిన 'వాక్ ఫర్ హోప్' మారథాన్ ను ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటని, అయినప్పటికీ సరైన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానం, కాలానుగుణంగా పరీక్షల ద్వారా క్యాన్సర్ తొలిదశలోనే గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నయం చేసుకొవచ్చని సూచించారు. అలాగే ప్రభుత్వ వైద్య సంస్థలు క్యాన్సర్ చికిత్సకు అందిస్తున్న సదుపాయాలను ప్రజలు వినియోగించుకొని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ జానకి పేర్కొన్నారు.

Next Story