న‌ల్ల‌మ‌ల‌లో ఆయుర్వేదిక్ మెడిక‌క‌ల్ క‌ళాశాల‌.. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అట‌వీ ప్రాంతంలో ఆయుర్వేదిక్ మెడిక‌ల్ క‌ళాశాలను తీసుకురాబోతున్న‌ట్టు ఎమ్మెల్యే చిక్కుడు వంవీకృష్ణ తెలిపారు. న‌ల్ల‌మ‌ల్ల ప్రాంత

న‌ల్ల‌మ‌ల‌లో ఆయుర్వేదిక్ మెడిక‌క‌ల్ క‌ళాశాల‌.. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అట‌వీ ప్రాంతంలో ఆయుర్వేదిక్ మెడిక‌ల్ క‌ళాశాలను తీసుకురాబోతున్న‌ట్టు ఎమ్మెల్యే చిక్కుడు వంవీకృష్ణ తెలిపారు. న‌ల్ల‌మ‌ల్ల ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, రీసెర్చ్ సెంటర్ మంజూరుకు నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు, సంబంధిత మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ డాక్టర్ మల్లు రవి సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ సహకారంతో మంజూరుకు సానుకూల నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గురువారం అచ్చంపేట మండలం శ్రీశైలం జాతీయ రహదారి హాజీపూర్ సమీపంలో రాష్ట్ర ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల డైరెక్టర్, అధికారులతో కలిసి 45 ఎకరాల స్థలాన్ని గుర్తించామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారన్నారు. నల్లమల్ల అడవులు అనగానే అనేక ఔషధాలకు నిలయమని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మరింత ఉపయోగపడుతుందన్నారు.

ఎమ్మెల్యే కృషి అమోహం...

ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆయుర్వేదిక్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రవి నాయక్ అన్నారు. రాష్ట్ర ఆయుర్వేదిక్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సహకారంతో ఇవాళ‌ స్థల పరిశీలన చేశామ‌ని తెలిపారు. ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల సెంటర్ కు చాలా అనుకూల ప్రదేశం అని ఎంచుకున్న ప్రదేశం నుంచి నల్లమల్ల అడవి ప్రాంతం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండడం శుభకరం అన్నారు. స్థల పరిశీలన చేసిన వారిలో ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, జిల్లా ఆయుర్వేదిక్ జోనల్ అధికారి గోపాల్ నాయక్ ఉన్నారు.

Next Story