స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-23 11:10:31  IST  )

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని మల్లాయిపల్లి గ్రామంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై తెలంగాణ ఖాదీ

స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని మల్లాయిపల్లి గ్రామంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై తెలంగాణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వార్ల నాగిరెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు తెలంగాణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి మహబూబ్‌నగర్ ప్రాంతీయ అధికారి జి. సైదా హాజరై, పీఎంఈజీపీ పథకం ద్వారా లభించే 25 శాతం 35 శాతం సబ్సిడీ రుణాలకు సంబంధించిన ముఖ్య మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, లోన్ శాంక్షన్ ప్రక్రియలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామీణ యువత, మహిళలు, రైతులు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడానికి ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ఒక మంచి అవకాశమని తెలిపారు. గ్రామస్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వంత వ్యాపారాలు, వృత్తులు ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కృష్ణమూర్తి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అబ్బాస్ జిల్లా పరిశ్రమల కేంద్రం (డిఐసి) జనరల్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.

Next Story