- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలల హక్కులపై అవగాహన సదస్సు
దిశ, గోపాల్ పేట : గోపాల్ పేట్ గ్రామంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ యాదయ్య రావడం జరిగింది.

దిశ, గోపాల్ పేట : గోపాల్ పేట్ గ్రామంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ యాదయ్య రావడం జరిగింది.అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేది ఒక సామాజిక దురాచారమని,దీనిని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని రూపు మాపాలని తెలియ చేశారు.బాల్యవివాహాలు అనేవి ఆడపిల్లల అభివృద్ధిని అడ్డుకునే చర్య అని, దాని వలన ఆడపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడడమే కాకుండా క్రమంగా గృహ హింస కూడా ఎదుర్కోవలసి వస్తుందని,కుటుంబం సమస్యలను స్తైర్యంగా ఎదుర్కోలేరని కావున బాల్య వివాహలు చేయకూడదని , అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలని సూచించడమైనది.జిల్లాలోని బాల బాలికల అందరి కోసం మిషన్ వాత్సల్య అనే పథకం కింద బాల రక్ష భవన్ పనిచేస్తుందని, రక్షణ అవసరమైన పిల్లలకు వసతి నిమిత్తం బాల సదనం ఉన్నదని తెలియ చేశారు.బాల్య వివాహం చేస్తున్నారని సమాచారం తెలిస్తే గనక వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు సమాచారం అందించాలని తెలియ చేశారు.అలాగే 14 సంవత్సరాల లోపు పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, పనులలో పెట్టుకోకూడదని సూచించడమైనది.బడి మధ్యలో మానేసిన పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని తిరిగి చదువుకునేట్టు గా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కమిటీ గ్రామం లోని బాల బాలికల హక్కులు కాపాడుతూ, పిల్లలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే పై అధికారుల దృష్టికి తీసుకు రావాలనిసూచించడమైనది.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ అయేషా అంజన్,బాలలపరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ లక్ష్మమ్మ, ఐసిడిఎస్ సూపర్వేజర్ ఈదమ్మ, హెచెం రామ్ దేవ్ రెడ్డి, ఎస్ ఏం సీ చైర్మన్ వెంకటమ్మ,ఎంపీవో భవానీ, పంచాయితీ కార్యదర్శి బాలరాజు, జిపిఓ అధికారి నాగరాజు,అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






