- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవార్డులు రచయితలకు గొప్ప ప్రేరణ అందిస్తాయి : సంచాలకులు ఏనుగు నర్సింహారెడ్డి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అవార్డులు రచయితలకు, కవులకు గొప్ప ప్రేరణ, భాద్యతను కలిగిస్తాయని, వారి కృషికి తగ్గ ప్రతిఫలం లభించిందని భావించేలా చేస్తాయని ప్రముఖ రచయిత, కవి

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అవార్డులు రచయితలకు, కవులకు గొప్ప ప్రేరణ, భాద్యతను కలిగిస్తాయని, వారి కృషికి తగ్గ ప్రతిఫలం లభించిందని భావించేలా చేస్తాయని ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోని కాళోజీ హాల్ లో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు రచించిన 'పెంకుటిల్లు' కవితా సంపుటి అవార్డు-2024 ను అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి కవులు కవిత్వాన్ని సీరియస్ గా రాయాలని, అలా రాస్తున్న వారిలో కాంచనపల్లి ఒకరని ఆయన అన్నారు. కాంచనపల్లి కి పాలమూరు సాహితీ అవార్డు ప్రకటించడం సరైన నిర్ణయం అని అన్నారు. అనంతరం డాక్టర్ కాంచనపల్లి కి పాలమూరు సాహితీ అవార్డు కింద ఆయన ను శాలువాతో సత్కరించి 5116 నగదు బహుమతిని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు మనోహర్ రెడ్డి, బుర్రి వెంకట్రామిరెడ్డి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బోల యాదయ్య, వెంకటేశ్వరరావు, ఏపూరి కిష్టప్ప, సురభి జగపతిరావు పాల్గొన్నారు.






