ఆటో, స్కూటీ ఢీ.. వ్యక్తి దుర్మరణం

by Taduka Kalyani |

ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గోపాల్ పేట మండల పరిధిలో జరిగింది.

ఆటో, స్కూటీ ఢీ.. వ్యక్తి దుర్మరణం
X

దిశ, గోపాలపేట్: ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గోపాల్ పేట మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాల్ పేటలోని చెన్నూరు వెనక తండాకు చెందిన రెడ్యా నాయక్ (40) స్కూటీపై పని నిమిత్తం వనపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా తాడిపర్తి గ్రామ శివారులో ఉన్న గాయత్రి డిగ్రీ కళాశాల ఎదుట గోపాల్ పేట వైపు నుంచి ఆటో వచ్చి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెడ్యానాయక్ తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు

.

Next Story