శ్రీశైలం జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు

by Nallavelli.Anjaneyulu |

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ సమీపంలోని కుంచొని మూల వద్ద అమ్రాబాద్ నుంచి అచ్చంపేట వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది.

శ్రీశైలం జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు
X

దిశ, అచ్చంపేట : హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ సమీపంలోని కుంచొని మూల వద్ద అమ్రాబాద్ నుంచి అచ్చంపేట వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విహారయాత్రకు సంబంధించి ఎస్సి వెల్ఫేర్ విద్యార్థులను నియోజకవర్గంలోని అన్ని వసతి గృహాల నుండి ఉమామహేశ్వర క్షేత్రానికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో అమ్రాబాద్ ఎస్సీ వెల్ఫేర్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఒక ప్రైవేటు ఆటోలో వెళుతున్నారు. ఆటోలు దాదాపు 15 మంది ఉన్నారని, కుంచొని మూల వద్ద కు వెళ్లేసరికి అదుపుతప్పి పడిపోయిందని ఈ ప్రమాదంలో విద్యార్థులు తరుణ్ పరశురాముడు తో పాటు వర్కర్ పురుషోత్తంకు గాయాలు అయ్యాయని తెలిపారు. వారిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వాసులకు ఇతరుల నుంచి ప్రథమ చికిత్స అందజేశారు. వారిలో ఒక విద్యార్థికి భుజం లో ఎముక పక్కకు తొలగిందని, మరో విద్యార్థికి చాతి భాగంలో బలమైన గాయాలు అయ్యాయని అలాగే వర్కర్ కు కూడా గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించి ప్రథమ చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయంపై ఎస్ డబ్ల్యూ పాండు ను దిశ ఫోన్ ద్వారా ప్రమాదం ఎలా జరిగిందని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కు ఒకరోజు విజ్ఞాన యాత్రలో భాగంగా ప్రత్యేకంగా ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశామని, ఆ బస్సులు మన్ననూర్ లో ఉండగానే వర్కర్ ప్రోత్బలంతోనే ఆటోలో విద్యార్థులు వెళ్లారని ఈ క్రమంలో వర్కర్ తో పాటు ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. బస్సులు ఉండగానే ఎలా వర్కర్ ఆటోలో తీసుకెళ్లాడని అధికారులను అడగగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

Next Story