- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో- బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
ఆటో-బైకు ఢీ కొని ఒకరికి తీవ్రగాయాల సంఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

X
దిశ, పాన్ గల్ : ఆటో-బైకు ఢీ కొని ఒకరికి తీవ్రగాయాల సంఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ విజయ్ గౌడ్ తన ద్విచక్ర వాహనం పై వనపర్తికి వెళ్తుండగా.. వనపర్తి నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారుడు విజయ్ గౌడ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆర్ఎంపీ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. అతని వద్ద ఉన్న రూ.70వేల నగదును కుటుంబ సభ్యులను అప్పగిస్తామని ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
Next Story






