- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా పట్టుబడ్డ రేషన్ బియ్యానికి వేలం
నారాయణపేట జిల్లాలో మక్తల్ నారాయణపేట కోస్గి స్టాక్ ప్యాంట్లలో నిల్వ ఉన్న అక్రమంగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పట్టుబడిన 644 క్వింటాళ్ల 67కిలోల రేషన్ బియ్యనికి బుధవారం రోజు జిల్లా డీఎస్ఓ కార్యాలయంలో అధికారులు వేలం నిర్వహించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలో మక్తల్ నారాయణపేట కోస్గి స్టాక్ ప్యాంట్లలో నిల్వ ఉన్న అక్రమంగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పట్టుబడిన 644 క్వింటాళ్ల 67కిలోల రేషన్ బియ్యనికి బుధవారం రోజు జిల్లా డీఎస్ఓ కార్యాలయంలో అధికారులు వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొన్న తొమ్మిది మందిలో దామరగిద్ద మండలం చౌడేశ్వర ట్రేడర్స్ యజమాని హరికృష్ణ కిలో బియ్యానికి రూ.27 రూపాయల 10 పైసలకు వేలం పాడి 644 క్వింటాళ్ల 67 కిలోల బియ్యాన్ని దక్కీంచుకున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. గత 24.25 సంవత్సరంలో కొంత మంది రేషన్ బియ్యంను తక్కువ ధరకు సేకరించి ఓక దగ్గర నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ కు అక్రమంగా రవాణా చేస్తుండగా సమాచారం మేరకు ఆకస్మికంగా విజిలెన్స్ అధికారుల దాడుల్లో పట్టుబడగా వాటిని నారాయణపేట.మక్తల్ .కోస్గి స్టాక్ పాయింట్ లో నిల్వ ఉంచారు. ఇలా ఉంచిన బియ్యం ముక్కి పురుగులు పట్టి పాడైపోతున్నావని సామాజిక మాధ్యంలో *దిశ*పత్రికలో రావడం జరిగింది అందుకు స్పందించిన అధికార్లు 664 క్వింటాళ్ల 67 కిలోలు రేషన్ బియ్యంకు బుధవారం జిల్లా డీఎస్ఓ కార్యాలయంలో వేలం నిర్వహించగా.. 9 మందికి వేలంలో పాల్గొన్న వారిలో దామరగిద్ద మండలం చౌడేశ్వర ట్రేడర్స్ హరికృష్ణ .27 రూపాయల 10 పైసలకు వేలంలో పాల్గొని దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన మొత్తం నగదు ని వారం రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు చెల్లించి అనుమతి పత్రంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులు వేలం పొందిన వ్యక్తికి చెప్పినట్టు సమాచారం.






