దిశ ఎఫెక్ట్.. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే 'ఏటీవీఎం' ఏర్పాటు

by Ratna Kumari |

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల 'నడక' కష్టాలు పై బుధవారం జిల్లా టాబ్లాయిడ్ లో 'ఆధునికీకరణ పనులతో తిప్పలు' కథనంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.

దిశ ఎఫెక్ట్..  రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే ఏటీవీఎం ఏర్పాటు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల 'నడక' కష్టాలు పై బుధవారం జిల్లా టాబ్లాయిడ్ లో 'ఆధునికీకరణ పనులతో తిప్పలు' కథనంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ రైల్వే కమర్షియల్ ఇన్ స్పెక్ట‌ర్ షేక్ అబ్దుల్ ముక్తార్ 'దిశ' తో మాట్లాడుతూ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లో బుధవారం ఉదయమే 'ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్' (ఏటివిఎం) ఏర్పాటు చేశామని, రైల్వే ఆధునికీకరణ పనులు పూర్తి అయ్యేవరకు తప్పని సరిగా కొంత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, ఈ మెషిన్ ఏర్పాటుతో కొంత మేరకు ప్రయాణికుల 'నడక' కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు.

Next Story