విద్యార్థినుల భద్రతకు ‘భరోసా’..

by Nallavelli.Anjaneyulu |

ఇటీవల మైనర్ బాలిక పై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో ధైర్యం నింపేందుకు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు గట్టు మండలంలో శనివారం ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

విద్యార్థినుల భద్రతకు ‘భరోసా’..
X

దిశ, గద్వాల క్రైం/గట్టు : ఇటీవల మైనర్ బాలిక పై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో ధైర్యం నింపేందుకు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు గట్టు మండలంలో శనివారం ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం, మనోపాడు, గట్టు గురుకుల పాఠశాలల్లో ఎస్సై శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం సిబ్బంది విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు.

వేధింపుల పై మౌనం వద్దు

విద్యార్థినులు తమ భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే శారీరక, మానసిక వేధింపుల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరిస్తూ ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’ మధ్య తేడాలను ఉదాహరణలతో వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

పోక్సో చట్టంపై హెచ్చరిక

లైంగిక దుర్వినియోగం మరియు వేధింపులకు పాల్పడే వారిపై పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఆపద సమయంలో డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇటీవల మైనర్ బాలిక పై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో ధైర్యం నింపేందుకు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు గట్టు మండలంలో శనివారం ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం, మనోపాడు, గట్టు గురుకుల పాఠశాలల్లో ఎస్సై శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం సిబ్బంది విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు.

వేధింపుల పై మౌనం వద్దు

విద్యార్థినులు తమ భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే శారీరక, మానసిక వేధింపుల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరిస్తూ ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’ మధ్య తేడాలను ఉదాహరణలతో వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

పోక్సో చట్టంపై హెచ్చరిక

లైంగిక దుర్వినియోగం మరియు వేధింపులకు పాల్పడే వారిపై పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఆపద సమయంలో డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించి రక్షణ పొందవచ్చని తెలిపారు.

Next Story