ఆ గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు లేనట్టే..!

by Ratna Kumari |

దిశ‌, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది అని ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, గ్రామాలు అభివృద్ధి

ఆ గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు లేనట్టే..!
X

దిశ‌, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది అని ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ గ్రామ ప్రజల ఆశా నిరాశగానే మిగిలింది. ఆ ఊరిలో ఎస్సీలు లేరు, అందరూ బీసీలు ఉన్నారు. కానీ ఆ ఊరు సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీ కులస్తులు లేరు రిజర్వేషన్ మార్పులు చేయాలని ఆ గ్రామస్తులు సెప్టెంబర్ నెలలో ధర్నాలు, రాస్తారోకో లు చేశారు. కలెక్టర్ కి కూడా వినతిపత్రాలు అందచేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ ఊరు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని దస్తురాబాద్ మండలంలో గల పెర్కపల్లి గ్రామం. ఆ గ్రామానికి మొదటిసారి జనరల్ వచ్చింది. ఈ సారి సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆ ఊరు సర్పంచ్ ఎన్నికకు దూరం అయింది. బీసీ 99.9 శాతం ఉన్న గ్రామానికి అధికారులు ఎస్సీ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించారు. అలాగే రెండు వార్డు లు కూడా ఎస్సీ కి రావడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరికపల్లె గ్రామంలో మొత్తం 554 మంది ఓటర్లు ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొత్తగా గ్రామపంచాయతీని ఏర్పాటు చేసింది. అప్పటి ఎన్నికల్లో సర్పంచ్ గా జనరల్ కు రిజర్వేషన్ ఇవ్వగా, బీసీ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచారు. గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం సర్పంచ్ అలాగే 2 వార్డు లను ఎస్సీ లకు అధికారులు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక్కరు కూడా ఎస్సీ లు లేకపోవడం వల్ల‌ సర్పంచ్ అభ్యర్థితో, పాటు 2 వార్డులలో నామినేషన్ వేయలేని పరిస్థితి నెలకొంది.

క‌లెక్ట‌ర్ కి విన‌తి ఇచ్చినా మార‌ని రిజ‌ర్వేష‌న్

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల రిజర్వేషన్లతో పాటు సర్పంచుల రిజర్వేషన్లు సెప్టెంబర్ నెలలో ఖరారు చేయగా.. ఖానాపూర్ నియోజకవర్గం లోని దస్తురాబాద్ మండలంలో ని గ్రామపంచాయతీ సర్పంచ్, రెండు వార్డు కు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఆ గ్రామస్తులు తమ గ్రామంలో ఎస్సీ కులస్తులు లేరని, ఆ వర్గానికి సర్పంచ్ రెండు వార్డ్ లకు సామాజిక వర్గీయులకు రిజర్వేషన్ చేయడంతో ఆ గ్రామస్తులు నిరసిస్తూ మండల కేంద్రంలోనూ, జిల్లా కేంద్రంలోనూ నిరసనలు తెలిపారు. ఆ గ్రామంలో మొత్తం 554 మంది ఓటర్లు ఉండగా.. అందులో నలుగురు ఎస్టీలు ఉండగా, మిగతా బీసీ కులానికి చెందినవారు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలని గ్రామస్తులు మూకుమ్మ‌డిగా సెప్టెంబర్ 29న నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతిపత్రం అందచేశారు. కానీ సర్పంచ్, వార్డ్ ల రిజర్వేషన్ మారకపోవడంతో ఆ ఊరు ప్రజలకు నిరాశ మిగిలింది.

Next Story